త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నార. ఈ సమావేశానికి మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధిచి పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. బీఆర్‌ఎస్ పతనమే టార్గెట్‌గా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన హస్తం .. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలా మంది గులాబీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుట ఎగురవేసిన కాంగ్రెస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలన్న వ్యూహంలో ఉంది.


