25 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

పాతబస్తీ కరెంట్‌ బిల్లులపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

   హైదరాబాద్ పాతబస్తీలో కరెంట్‌ వసూళ్లపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే బిల్లు వసూళ్లు అదానీ సంస్థకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో వెల్లడిండచంతో ప్రస్తుతం ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

   పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా అదానీ గ్రూప్‌కు అప్పగించాలని నిర్ణయిం చిన రేవంత్‌ సర్కార్‌, దీనికి సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిపింది. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కం నుంచి సమాచారం సేకరించింది. అయితే కరెంటు పంపిణీ, బిల్లుల వసూలు బాధ్యత లను ప్రైవేటుకు అప్పగించాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాలి. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వు లు ఇవ్వకపోయినా ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాత బస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్‌ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పాత బస్తీలో కరెంట్ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని వసూలు చేసేందుకు వెళ్లే కరెంట్‌ సిబ్బంది పై దౌర్జన్యానికి దిగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. పాతబస్తీ తర్వాత హైదరాబాద్ నగరంలో, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆదానికి అప్పగిస్తా మని తెలిపారు. అదానీ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయంలో 75% రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 25% అదానీ గ్రూప్‌కు వెళ్తుందని ఆయన వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అదానీ గ్రూప్‌తో చర్చించామని, వారు అంగీకరించారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని అదానీ గ్రూప్‌ను కోరినట్టు చెప్పారు. రేవంత్‌ నిర్ణయం పట్ల విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారని, అందుకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో తెలంగాణ పవర్‌ను పెట్టబోతున్నారని మండిపడుతున్నారు. భవిష్య త్తులో కరెంట్‌ కావాలన్నా, కనెక్షన్‌ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు, వినియోగదా రులు మోకరిల్లాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్