CM KCR | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం కేసీఆర్. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధుపై ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దళిత బందును లబ్దిదారులకు చేర్చే క్రమంలో కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు కేసీఆర్. ఆ చిట్టా తన దగ్గరుందని.. మరోసారి వసూళ్లకు దిగితే టికెట్ కాదు పార్టీనుంచి వెళ్లిపోవడమే ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలే కాదు.. వారి అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని. ఇదే చివరి వార్నింగ్ అంటూ కేసీఆర్ హెచ్చరించారు.