CM KCR | కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) నియోజకవర్గ పర్యటనలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజవర్గ అభివృద్ధికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas) ఎంతో కష్టపడ్డారని.. ఇంతటితోనే ఆగకుండా ఇంకా కృషి చేయాలని ఆకాంక్షించారు. పోచారం వయసు పెరుగుతోందని అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే తనకు కూడా 69సంవత్సరాలు వచ్చాయని.. ముసలోడిని అవుతున్నానని కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సమైక్యరాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని.. తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్నీ సాధించుకున్నామని ఈ సందర్భంగా కేసీఆర్(CM KCR) వెల్లడించారు.