స్వతంత్ర, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌లో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అమోఘంమని అన్నారు. అధికారులు పాలకులు సమన్వయంతో పనిచేసి తెలంగాణను అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. మరింత కృషి చేసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలన్న సీఎం.. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
తెలంగాణలో ఇప్పటికి ఉన్న చాలా సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. ఇందులో అధికారుల పాత్ర ఎంతో ముఖ్యం .. పేద బడుగు బలహీన వర్గాలను అందరితో సమాన స్థాయికి తీసుకురావడంలో ఉద్యోగుల కృషి అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మానవీయ కోణంలో చూసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.


