స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(JPS)కు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. JPSల సర్వీసును క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, ఎస్పీ/డీసీపీ సభ్యులగా ఉండనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కాగా కొన్నిరోజుల క్రితం వరకు తమను రెగ్యులర్ చేయాలని జేపీఎస్‌లు నిరవధిక దీక్షలు చేసిన సంగతి తెలిసిందే.