BRS MLC candidates |రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్ పేర్లును ప్రస్తావించారు. అలాగే మరో అభ్యర్థిగా చల్లా వెంకట్రామిరెడ్డి పేరు ప్రకటించారు. ఈనెల 9న వీరు నామినేషన్ వేయాలని సీఎం సూచించారు. వీరి నామినేషన్ సంభందిత ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యయెటువంటి ఇద్దరి పేర్లను కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించనున్నట్లు తెలిపారు.
Read Also: శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపు శాశ్వతంగా రద్దు
Follow us on: Youtube Instagram