లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్ష పార్టీలు ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారు. మహిళలు, యువకులు, కార్మికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు.
జగన్ బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి 9వ రోజు యాత్రను ప్రారంభించారు. కోవూరు క్రాస్ మీదుగా రాజు పాలెం వద్దకు చేరుకున్నారు. అక్కడ జగన్‌ను కలిసేందుకు అభిమానులు పోటెత్తారు. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.తిప్ప, గౌరవరం మీదుగా RSR ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనం తరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు.