స్వతంత్ర, వెబ్ డెస్క్: నేడు గుంటూరు జిల్లాలో సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గుంటూరులో వైయస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2 కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి చుట్టుగుంటలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైయస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2 వద్దకు చేరుకొని.. రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.


