34.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

       ఏపీ సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి ఈ మధ్యాహ్నం ప్రవేశించిన జగన్‌ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. 15 వందల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం నెల్లిమర్ల నియోజక వర్గంలో జగన్‌ యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో విజయనగరం నియోజకవర్గం చెల్లూరు జంక్షన్ వద్ద బహిరంగ సభకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఇక బహిరంగ సభ అనంతరం చింతవలస, భోగా పురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రికి జగన్‌ బస చేస్తారు. జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, యువత, కార్మికులు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్‌ ముందుకు సాగుతున్నారు. మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సఝాన్సీ లక్ష్మి అన్నారు. విశాఖని అభివృద్ధి బాటలో నడిపించేది కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్