స్వతంత్ర వెబ్ డెస్క: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపనుతున్నారు. ముందుగా అమిత్ షా తో భేటీ అయినా జగన్ ఆయనతో 45నిముషాలు ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోడీ తో జగన్ సమావేశమయ్యారు. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 1.20 గంటలకు పైగా సాగింది.. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే రూ.12,911 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అంతకుముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఏపీకి ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర అంశాలపై నిర్మలతో చర్చించారని సమాచారం. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.
ప్రధానితో ముగిసిన సీఎం జగన్ భేటీ..
Latest Articles
- Advertisement -