24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఆరు గ్యారెంటీల అమలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అధికారుల బదిలీ సహా ఇతర అంశాలపై ఇప్పటివరకు దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి…ఇప్పుడు పాలనా పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై కలెక్టర్లతో జరిగే సదస్సులో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని గతంలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై కలెక్టర్ల సమావేశంలో చర్చించి విధివిధానాలు రూపకల్పన చేయాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా కొత్త కార్డులు ఇవ్వకపోవడం, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించకపోవడంతో లక్షలాదిగా తెలంగాణ ప్రజానీకం రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరించే కార్యక్రమం ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై కలెక్టర్ల మీటింగ్‌లో చర్చించనున్నారు.

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీఆర్‌ఏల మార్పు తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి..ఆయా సమస్యల కోసం గ్రామ సభల ద్వారా ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి… వాటి పరిష్కారాలు ఏ మేరకు అయ్యాయి అన్న దానిపై కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిలో విడుదల చేసిన నిధులు ఎన్ని.. అందులో ఏ మేరకు ఖర్చు చేశారు.. ఎందుకోసం ఖర్చు చేశారు అన్నదానిపై ప్రభుత్వం వివరాలు తీసుకోనుంది. ఇక, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన మహాలక్ష్మి స్కీం అమలుపై క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపైనా కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తలపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి సత్వరా పరిష్కారం కోసం ఇంఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించారు. భారీగా ఫిర్యాదులు వస్తుండడంతో మంగళవారం, శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. దీన్ని, ఇక మీదట జిల్లాల్లోనూ నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 28 నుంచి ప్రజావాణి ప్రారంభం కానుండడంతో … జిల్లా కలెక్టర్లు వీటికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దానిపై సీఎం ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ప్రజా పాలన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించనున్నారు ముఖ్యమంత్రి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీఇచ్చింది. కానీ, కాలక్రమంలో అది కాస్తా గాలిలో కలిసిపోయిందన్న విమర్శలు వచ్చాయి. కొత్త ప్రభుత్వంలో గృహలక్ష్మి పేరుతో ఐదు లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచారు. గతంలోనే ఇలాంటి స్కీం కోసం మూడు లక్షలకు పైగా లబ్దిదారులు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు కొత్త స్కీం అమలు చేస్తే ఇంకెంత ప్రభావం పడుతుందన్న దానిపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక, గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి, వాటికి కొనసాగింపుగా లబ్ధిదారుల నుండి వస్తున్న ఫిర్యాదులపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ప్రభుత్వనికి నివేదిక ఇవ్వనున్నారు కలెక్టర్లు.అలాగే..ఆయా జిల్లాల్లో ఉన్న అసైన్డ్‌, మిగులు భూముల వివరాలను సీఎం రేవంత్ ముందు ఉంచనున్నారు కలెక్టర్లు.

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్