గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నాశనం చేసిందని మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సరెండర్ లీవులు, GPF, TA బిల్లులు, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్నింటినీ పెండింగ్ పెట్టి ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఖాకీలుపై ప్రశంసల జల్లు కురిపించారు.