సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై మూడు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కలుషిత తాగు నీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అన్ని చోట్లా వ్యవస్థ లు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.