ఏపీ పాలనలో మంత్రి వపన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారా అందుకే ఆయనకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారా డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరికే ఇవ్వడంలో బాబు ఆంతర్యమేంటి? పరిపాలనలో పవన్ భాగస్వామ్యం పెంచేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది.
జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు. మిత్ర పక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చిన చంద్రబాబు 2019–24 మధ్య కాలంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు అప్పటి సీఎం జగన్.అయితే, ఇప్పుడు కేబినెట్‌లోకి పవన్ కల్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు చంద్రబాబు.
పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం పెంచేలా చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంతోపాటు కీలక శాఖలను అప్పగించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. గ్రామీణ ప్రజలు, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే శాఖలను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పవన్ ముద్ర పడేలా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు చంద్రబాబు ఇష్టమైన టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు చంద్ర బాబు. ఈ విధంగా మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు వారికి కూడా పరిపాలనలో సరైన ప్రాధాన్యత ఇచ్చామని సంకేతాలు ఇచ్చారు.