Mallu Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాటి కల్లు సేవించారు.పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు భట్టి. ఈ క్రమంలో యాత్ర బహ్మణపల్లి గ్రామంలో ప్రవేశించగా.. అక్కడి ప్రజలు భట్టికి స్వాగతం పలికారు. గౌడ సామాజికవర్గం విజ్ఞప్తి మేరకు వారితో కలిసి కల్లు తాగారు. యాత్రలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యల గూర్చి ఆరాతీస్తున్నారు. అడుగడుగునా సీఎం కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. భట్టి కల్లు సేవించడం పట్ల బ్రాహ్మణపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.