హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి వాతావరణం చల్లగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, పలు ప్రాంతాల్లో ఉరుముల తో కూడిన వర్షం పడుతోంది. నగరంలోని మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ ప్రాంతాల లో చిరు జల్లులు కురుస్తున్నాయి. బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతా ల్లోనూ వాన కురుస్తోంది. నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మే 23వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరిం చింది. అల్పపీ డనం మే 24నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.