స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 07.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహణ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం 08:30 నుంచి 09:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో ఒంటి పూట బడుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది.