పోలింగ్ ముగిసినా ఏపీలో హింసాకాండ చల్లారలేదు. అనంతపురం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉద్రిక్తతలు కొనసా గుతున్నాయి. పోలీసులను మోహరింపచేసి 144 సెక్షన్ అమలు చేసినా ఎక్కడో ఓ చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అల్లర్లకు మీరు కారణమంటే మీరు కారణమంటూ వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుం టున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్, డీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేయగా వైసీపీ కార్యకర్తలపై దాడులను చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసింది అధికార వైసీపీ. ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస, దాని వెనుక ఉన్న కారణా లపై ఫిర్యాదు చేయనుంది. హింసాకాండకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనుంది. మంత్రి బొత్స సత్యన్నారాయణ నేతృత్వంలో వైసీపీ బృందం గవర్నర్‌తో భేటీ కానుంది.


