ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మండల రాజు వాహనాల తనిఖీలు చేశారు. కన్నాయి గూడెం మండలం ఏటూరు ఇసుక రాంపు నుంచి వెళుతున్న లారీలను పోలీసులు తనిఖీ చేశారు. లారీల బరువును వెయింగ్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేయగా ఐదు లారీలు అధిక బరువు ఉండటాన్ని గుర్తించారు. ఐదు లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత యజమాన్యాలు ఇలాంటి అవకత వకలకు పాల్పడకుండా ఉండాలని సీఐ మండల రాజు తెలిపారు.


