33.2 C
Hyderabad
Wednesday, February 12, 2025
spot_img

వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు.. జాతీయ స్థాయిలో విమర్శలు

కుటుంబ వారసత్వంపై సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వారసత్వం గురించి ఆయనపై జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనవడు కావాలన్న తన కోరికను బయటపెట్టడం ఇంటర్నెట్‌లో విమర్శలకు దారి తీసింది. మగపిల్లాడు తమ వారసత్వాన్ని కొనసాగిస్తాడన్న కామెంట్స్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు.

మంగళవారం నాడు బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆ ఈవెంట్లో రామ్‍చరణ్ కూతురు క్లీంకారతోపాటు తన ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫొటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫొటోను చూపిస్తూ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. కామెడీ సినిమా ఈవెంట్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. మనవరాళ్లతో తన ఇళ్లు ఓ లేడీస్ హాస్టల్‌లా ఉందని, తాను వార్డెన్‌లా మారానని నవ్వుతూ చెప్పారు. ఫ్లో కంటిన్యూ చేస్తూ.. రాంచరణ్‌కు కూతురు పుట్టిందని, మళ్లీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నానని అన్నారు. అంతటితో ఆగకుండా రాంచరణ్‌కు కొడుకు పుట్టాలని తనకు కోరికగా ఉందని చిరంజీవి చెప్పారు. చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగపిల్లాడు కూడా లేడని .. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రామ్‍చరణ్‍కు సలహా ఇచ్చానని చెప్పారు.

తమ కుటుంబం వారసత్వం కోసం అబ్బాయిని కనాలని రామ్‍చరణ్‍కు చెప్పానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంకో ఆడబిడ్డని కంటాడేమోని భయం అన్న మాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ కాలంలో కూడా మగపిల్లలే వారసులు అని చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తి అనడం సరి కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. చిరంజీవి లంటి సెలబ్రిటీలో పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంటున్నారు.

మనవరాలు కూడా చిరంజీవి వారసత్వాన్ని కొనగించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. అపోలో అధినేత మనవరాళ్లను, అశ్వినీదత్‌ కూతుళ్లను ఉదాహరణగా చూపిస్తున్నారు.

Latest Articles

కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్న ఆ ఎమ్మెల్యే?

కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే గుదిబండలా మారాడా? ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని పార్టీలో చేర్చుకుంటే.. ఇప్పుడు పార్టనే ఓడించే స్కెచ్చులు వేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్