24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

చిరంజీవి Vs అనిల్ సుంకర.. భోళా శంకర్ రెమ్యూనరేషన్ రచ్చ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: భోళా శంకర్ (Bola Shankar) అనే సినిమా డిజాస్టర్ వైపుగా అడుగులు వేస్తుంది. ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల షేర్ వసూలు చెయ్యలేని పరిస్థితి. అంటే ఆచార్య కంటే పెద్ద డిజాస్టర్ కంఫర్మ్ గా కనిపిస్తుంది. ఏజెంట్ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్న నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) ఆ తరువాత సామజవరాగమన వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఆ తరువాత హిడింబి అనే చిన్న సినిమా వర్క్ అవుట్ కాకపోయినా నాన్ – థియేట్రికల్ తో కొంత మేర బయటపడ్డారు. అయితే అనిల్ మీద భోళా ఇంకో బాంబు వేసింది. ఒక్క వైజాగ్, వెస్ట్ తప్పితే అన్ని చోట్లా ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సీడెడ్ శోభన్ తగ్గించి కట్టారట. నైజాం, ఓవర్సీస్, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ అన్నీ ఓన్ రిలీజ్లే.

ఇందులో కొంత మేర స్వయం కృతాపరాధం అనుకోవాలి కాంబినేషన్ సెట్ చేశారు కాబట్టి. అయితే చిరంజీవి(Chiranjeevi) కూడా అనిల్ ని ఎంతో ఇబ్బంది పెట్టారని వార్తలు వస్తున్నాయి. తనకు కమిటైన 65 కోట్లు ఇస్తే గానీ కుదరదని చిరంజీవి కూర్చున్నారట. బిజినెస్ జరగక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ షాద్ నగర్, సూర్యాపేటలోని కొన్ని స్థలాలు, అలాగే హైదరాబాద్ లోని విలాసవంతమైన ఇల్లు తాకట్టు పెట్టి… చిరంజీవి డబ్బులు రిటర్న్ చేసి… ఆ తరువాత రిలీజ్ అవాంతరాలు లేకుండా జరిపించుకున్నారు.
రిలీజ్ కి ముందు తాను ఇబ్బందుల్లో ఉన్నా అని… రెమ్యూనరేషన్ లో కొంత భాగం కింద సాటి లైట్ రైట్స్ పెట్టుకోమన్నా చిరంజీవి ఫుల్ సెటిల్ మెంట్ కు పట్టుబట్టారట. అయితే ఇంకో వెర్షన్ ప్రకారం చిరంజీవి కి లాస్ట్ మినిట్ సెటిల్ మెంట్ చేసాకా కూడా ఇంకో పోస్ట్-డేటెడ్ చెక్ సెటిల్ మెంట్ మిగిలి ఉందని అంటున్నారు. “అనిల్ నిర్మాత కాకపోతే సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు” అని ఇండస్ట్రీ లో అంతా అనుకోవడం పరిస్థితికి అద్దం పడుతుంది.
ఇక్కడ ఇంకో కొసమెరుపు కూడా ఉంది. మధ్యలో అనిల్ కు నైజాం 16-17 కోట్ల ఆఫర్ వచ్చిందట. నా వాల్తేరు వీరయ్య 33 కోట్లు చేస్తే తక్కువకు అమ్మి నన్ను అవమానిస్తావా అని అనిల్ ని ఆపారట చిరంజీవి.  ఆ ఏరియా కూడా ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నైజాం నుండి కనీసం 10 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి. చిరంజీవి తో సినిమా చేసే నిర్మాత కు కూడా ఈ పరిస్థితి అంటే ఇండస్ట్రీ లో నిర్మాతల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది.

Latest Articles

BREAKING: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం బేలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్