స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటికే 240మంది మృతు చెందినట్లు తెలుస్తోంది. ఇంకా 1000మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో జాయిన్ చేయడంతో గాయపడిన వారి కోసం రక్తదానం చేయడానికి పలువురు ముందుకొచ్చి హాస్పిటల్స్ వద్ద రెడీగా ఉన్నారు. దీంతో తీవ్ర గాయాలతో రక్తం పోయిన వారికి దాతల నుంచి రక్తం తీసుకొని ఎక్కిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది.
ఈ రైలు ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిరంజీవి తన ట్వీట్ లో.. రైలు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాల రోదనలు వింటుంటే నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద అభిమానులు, దగ్గర్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.