సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జులై ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయా లని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు చొప్పున కేటాయించాలన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మొత్తం నాలుగు రకాల క్యాటగిరీల పింఛనుదారులలో, 11 సబ్ క్యాటగిరీలకు చెందిన పెన్షన్ దారులకు మొత్తం 7000 పంపిణీ చేయాలని ఆదేశించారు. జులై నెలకు సంబంధించి 4000, ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించి 1000 చొప్పున ఏరియర్స్ 3000పంపిణీ చేయాలని సూచించారు.


