Chhattisgarh| చావైనా బ్రతుకైనా నీతోనే నువ్వులేని జీవితం నాకొద్దు నన్ను ఆపకండి చనిపోనివ్వండి అంటూ భర్త చితిపై భార్య పడుకొని రోదించిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ఈ హృదయవిదారక సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేరం గ్రామంలో జరిగింది. జిల్లా అరాంపూర్ లో డీఆర్జీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబ్ అమర్చి పేల్చిన ఘటనలో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో బీజాపూర్ జిల్లా నేరం గ్రామనికి చెందిన జవాన్ లక్ను కూడా ఉన్నాడు. దంతెవాడలో అధికారిక లాంఛనాలతో మృతులకు నివాళులు అర్పించిన సీఎం భూపేష్ బఫేల్.. వారు త్యాగాలు వృధా కానివ్వమని అన్నారు. అనంతరం జవాన్ మృతదేహాలను వారి స్వంత గ్రామాలకు పంపించారు.
ఈ క్రమంలో ఓ వీరజవాన్ శవాన్ని కూడా సీఎం తన భుజాలతో మోశారు. అమరుడైన లక్ను భౌతిక కాయాన్ని కూడా బీజాపూర్ జిల్లా నేరం గ్రామానికి పంపించారు. జవాన్ భౌతిక కాయాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. అనంతరం లక్ను భౌతికకాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధం అయ్యారు. భర్త అంతిమ యాత్రలో పాల్గొన్న భార్య తులే మధామి.. తన భర్త లేడు అన్న మాటను జీర్ణించుకోలేక పోయింది. ఒక్క సారిగా అతని చితిపై పడుకొని భర్తతో పాటు తానుకూడా చనిపోతానని ఇద్దరిని కలిసి పైలోకాలకు పంపించాలని వేడుకుంది. అక్కడి వారి ఎంత చెప్పినా.. భర్తతోనే నా సుఖం, సంతోషం.. ఇక ఇప్పుడు మరణం కూడా అంటూ ఆమె బాధాతప్త హృదయంతో మాట్లాడిన తీరు అంతరిని కంటతడి పెట్టించేలా చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేయడంతో.. చూసిన ప్రతిఒక్కరూ బాధలో మునిగిపోతున్నారు.