తెలంగాణలో కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. చేవెళ్ల పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలు చేవెళ్ల, శేర్లింగంపల్లి తాండూరు, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజవకర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఓట్లు లెక్కింపు కొనసాగుతుందని కట్టుదిట్టమైన భద్రతతో పోలీసుల బందోబస్తు నిర్వహి స్తున్నారని చెప్పారు.


