18.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర

   హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. యాత్రలో మొదట సందర్శించే యము నోత్రికి భక్తులు పోటెత్తారు. రెండో రోజునే వేలాది మంది ఒక్కసారి యాత్ర చేయడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.మే 11నే వేలాది మంది భక్తులు యమునోత్రి ధామ్ కు తరలిరావడం విశేషం. యాత్రలో భాగంగా ఇరుకైన, ప్రమాదకరమైన మార్గాల్లో ప్రజలు చిక్కుకు పోయారు. ప్రజలు ముందుకు కదలలేక గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గుర్రాల పైన, డోలీలోనూ యమునోత్రికి వెళ్లే భక్తులు. కాలినడక భక్తుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, హోంగార్డులు లేకపోవడంతో తొలిరోజు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇబ్బంది పడుతున్న భారీ జనసందోహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులను పోలీసులు కోరారు. తొక్కిసలాట జరగకుండా అదనపు బలగాలను తరలిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్