నెల్లూరులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నగర మేయర్ పొట్లూరు స్రవంతి, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి వల్లనే తాను ఈ మేయర్ పదవిని అందుకున్నానని ఆమె తెలిపారు. కొన్ని కారణాలవల్ల వైసిపి అధికారంలో ఉండగానే రూరల్ ఎమ్మెల్యే టిడిపి పార్టీకి మారడంతో.. వారితో పాటే తమ పయనం కూడా కొనసాగించాలనుకున్నామని చెప్పారు. అప్పటి అధికార పార్టీ తనపై ఒత్తిడి తేవడంతో తిరిగి వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని స్రవంతి అన్నారు.


