30.2 C
Hyderabad
Friday, June 21, 2024
spot_img

చంద్రబాబు చరిత్ర మొత్తం వెన్నుపోట్లు… మోసాలు.. అబద్ధాలే- సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: సోమవారం నగరిలో జరిగిన కార్యక్రమంలో విద్యా దీవెన(Vidya Diwena) నిధులను సీఎం విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.680.44 కోట్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu) ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్(CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ఆరోపించారు.

సొంత కొడుకుపై నమ్మకం లేకనే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. పుంగనూరులో(Punganooru) అల్లర్లు సృష్టించారని, పోలీసులపై దాడి చేశారని చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక్క మంచి పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పాలన ఉండేదని దుయ్యబట్టారు.

Latest Articles

‘పోలీస్ వారి హెచ్చరిక’ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ తేజ

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్థన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్