స్వతంత్ర వెబ్ డెస్క్: మహానాడు కార్యక్రమంలో తెలుగు తమ్ములను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగుదేశం కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్తకర్తి శిరస్సు వంచి పాదాభివందనం అంటూ పేర్కొన్నారు. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు తోడుగా ఉంటాను అన్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటున్నానని.. ఎన్టీఆర్ శతజయంతి సాక్షిగా.. ఈ మహానాడులో చెపుతున్నాని అండగా ఉంటానన్నారు.
సంపద సృష్టించడమే కాదు.. పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ అన్నారు చంద్రబాబు. 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని.. ఎన్నో మాటలు చెప్పి మోసం చేసి.. ఏపీ ప్రజలకు అన్యాయం చేసారని.. వారి దౌర్జ్యనం ఇంకా ఎన్నో రోజులు సాగదని.. అమరావతికి రూపం ఇస్తే.. దాన్ని విధ్వంసం చేశారన్నారు. దేశంలోనే పేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ. అందరు సీఎంల కంటే ధనిక ముఖ్యమంత్రి జగన్. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువే. స్కాముల్లో మాస్టర్ మైండ్ జగన్. నాలుగేళ్లలో జగన్ చేసిన అవినీతి రూ.2.27 లక్షల కోట్లు. 3 రాజధానులంటూ.. అసలు రాజధానే లేకుండా చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు
పోలవరం పూర్తి అయ్యి నదుల అను సంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవన్నారు చంద్రబాబు. ఒక్క రోడ్డు వేయలేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదన్నారు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు.. జాబ్స్ లేవన్నారు. ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నారని.. 25 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను అని.. ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. అమ్మఒడి ఒక నాటకం.. నాన్న బుడ్డి వాస్తవం అన్నారు. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు.