ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయం త్రం 4గంటల 41 నిమిషాలకు సీఎం చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు తొలి సంతకం దేనిపైన అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మెగా డీఎస్సీ ఫైల్ పైనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు అని తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4వేలకు పెంపు ఫైల్ పై మూడో సంతకం చేస్తారని తెలుస్తోంది.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు సచివాలయానికి వెళ్లేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టొచ్చని భావించారు. కానీ, ఇవాళ మంచి రోజు కావడంతో సాయంత్రం 4గంటల 41 నిమి షాలకు చంద్రబాబు సచివాలయంలో ని తన చాంబర్ లో ఆసీనులు అవబోతున్నారు. ఆ వెంటనే పరిపా లనను పరుగులు పెట్టించనున్నారు. ఉద్యోగ సంఘా లు, రాజధాని రైతులు చంద్రబాబుకు ఘన స్వాగ తం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి సాధారణ పరిపా లనపై చంద్రబాబు దృష్టి పెట్టబో తున్నారు. ఇవాళ్టి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు.
గత పాలకులు ఐదేళ్ల కాలంలో అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు టీడీపీ అధి కారంలోకి రావడంతో చంద్రబాబుపై రాజధాని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పు డెప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు? ఎప్పుడెప్పుడు తమకు పునర్ వైభవం వస్తుందోనని, మంచి రోజులు వస్తాయోనని ఎదురుచూస్తున్నారు.
డీఎస్సీ పై తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ విజయానికి దోహదపడిన మూడు నాలుగు అంశాల్లో ప్రధానంగా ఉన్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై చంద్రబాబు రెండో సంతకం పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం. సామా జిక పెన్షన్ 4వేలకు పెంపు ఫైల్ పై పెట్టబో తున్నారు. స్కిల్ సైన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్న క్యాం టీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైనా సంతకం చేయనున్నారు. తాను ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేడయంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.