రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారం లో మూడు రాజధానుల నాటకమా డారని చెప్పారు. మూడు రాజధానులు కాదు. ఒక్క రాజధాని అయినా కట్టారా అని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగారని, నేడు జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని చంద్ర బాబు ప్రజలకు సూచించారు. ప్రజల కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని కోరారు. వైసీపీని చిత్తచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


