ఏపీ సీఎం చంద్రబాబు తన మార్క్‌ను చూపించే ప్రయత్నంలో పడ్డారు. ఈ క్రమంలో గత వైసీపీ పాలన లోని పథకాల పేర్లను మారుస్తున్నారు.అందులో భాగంగానే వైఎస్‌ఆర్ ఆసరా పెన్షన్‌ను ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంగా గతంలో ఉన్న పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుండి ప్రభుత్వ శాఖలకు సంబం ధించి ఫిర్యాదులు, సూచనలు చేయడానికి ప్రస్తుతం స్పందన కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, స్పందన కార్యక్రమం అమలులో అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించింది చంద్రబాబు సర్కార్.దీంతో గతం లో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డ కారణంగా, తిరిగి త్వరలో రాష్ట్రస్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టంను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురానుంది చంద్రబాబు సర్కార్.