స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని. మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా పరనిందా, ఆత్మస్తుతి అని అన్నారు. సైకిల్ కరెంట్ పెడితే దూసుకుని పోతుందని అంటున్నాడు. సైకిల్, మోటార్ బండి ఒకటి అవుతుందా? అంటూ వ్యంగ్యస్తారు ప్రయోగించారు. నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు దొంగిలించిన సైకిల్ అది.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం నీడలో ఉన్నాడన్నారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబని వ్యాఖ్యానించారు. మీ నాన్న ఖర్జూర నాయుడు నీకిచ్చిన ఆస్తి ఎంత? రెండు ఎకరాల నుంచి వేయి కోట్ల ఆస్తి ఎలా సంపాదించావ్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.