చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే టీడీపీకి పది శాతం ఓట్లు పడ్డాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని మండిపడ్డారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన జగన్.. టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రంలో భయాకన వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని సూచించారు. దాడుల సంస్కృతిని ప్రొత్సహించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని జగన్ నిలదీశారు.


