ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజే శారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీ ఫారాలు అందజేసి రాష్ట్ర పునర్ని ర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపుని చ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అభ్యర్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలు చోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చివేసింది .
పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్కుమార్పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ ను బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పించారు. వెంకట గిరిలో రామకృష్ణకు బీ ఫారమ్‌ను చంద్రబాబు అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటికి పొత్తు కుదిరింది. ఇక జనసేనల 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి పొత్తులు కుదిరాయి. ఇప్పటికే జనసేన అధినేత పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు.


