సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి ఇప్పుడు సూపర్ సిక్స్‌ను సూపర్ చీట్‌గా మార్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గతంలో అన్న క్యాంటీన్ల పేరుతో అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారన్న ఆయన అన్న క్యాంటీన్లు రద్దీ ప్రాంతాల్లో ఉండాలి కానీ.. 114 అన్న క్యాంటీన్లు ఊరికి దూరంగా ఉన్నాయని తెలిపారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అంచనాలు పెంచి 31కోట్లు దారి మళ్లించారన్నారు. అన్న క్యాంటీన్లకు వ్యతిరేకం కాదన్న అంబటి అధ్యయనం చేసిన తర్వాతే ఆరోపణలు చేస్తున్నామని తెలిపారు.