ఆంధ్రప్రదేశ్: అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై ఈసీ కి ఫిర్యాదు చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు ఇక్కడ కూడా అదే పని చేసాడని విమర్శించారు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్ళాయని అన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని.. కేవలం 9 లక్షల మంది వేసిన ఓట్లను ప్రాతిపదికగా ఎలా చూస్తామని ప్రశ్నించారు.
‘ఏ రకంగాను ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత కాదు. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు. మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరు. యువత కు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసింది. తెలంగాణలో దొరికిపోయినట్లు ఇక్కడ కూడా టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చు.’ – సజ్జల రామకృష్ణారెడ్డి