టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వ హించే బహిరంగసభల్లో వీరు పాల్గొంటారు. ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుం టారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.
సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తర్వాత నిడదవోలు తిరుమల సాయి కల్యాణ మంటపంలో చంద్రబాబు. పవన్ కల్యాణ్ రాజమండ్రి లోని షెల్టాన్ హోటల్ లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయగోదావరి జిల్లాల నేతలతో చంద్ర బాబు సమీక్ష నిర్వహించనున్నారు.


