స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదలడం లేదు. ఇప్పటికే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మరోవైపు ఆయన తనయుడు లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ యువతకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం పోరాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రైతు పోరుబాట పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు ఉదయం మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తణుకు నియోజకవర్గంలో మొత్తం 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్ర సాగనుంది.