స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టి ట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీనివాసులు శెట్టికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్.బి.ఐ. మరెన్నో మైలురాళ్ళు అందుకోవాలని పవన్ ఆకాక్షించారు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన వ్యక్తి శ్రీనివాసులు శెట్టి అని కొనియాడారు. ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని పవన్ ఆకాంక్షిం చారు.