అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి కోసం అన్నపూర్ణ స్టుడియోస్ అందంగా ముస్తాబైంది. ఇవాళ రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు నాగచైతన్య.
మొన్న జరిగిన మంగళ స్నానాలతో నాగచైతన్య-శోభిత వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి కొడుకుగా, శోభితను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. రాత్రి కొంతమంది ప్రముఖులు, స్నేహితులకు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు నాగచైతన్య. ఈ పెళ్లికి 3 వందల నుంచి 4 వందల మంది అతిథులు వచ్చే అవకాశం ఉందని నాగార్జున ఇదివరకే ప్రకటించారు.