TDP MLC Bhumi Reddy Ramagopal Reddy | వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల పట్టణ సీఐపై విచారణకు ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనా. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా సీఐ పనిచేశాడని.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సీఈవోకు ఫిర్యాదు చేశారు. మార్చి 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. వైసీపీ నాయకులు అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లారని ఆరోపించారు. ఆ సమయంలో సీఐగా ఉన్న రాజు సహకారంతోనే వారు వెళ్లారని భూమిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. రామగోపాల్ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో.. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారించిన అనంతరం నివేదికను అందించాలని రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.