AP Special Status |ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అధ్యాయమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం ఏపీకి నిధులు కేటాయించిందా? అని వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని తెలిపింది. 2015-18 మధ్య ఏపీ ప్రభుత్వం తీసుకున్న పథకాలకు వడ్డీపై రుణాలు కూడా చెల్లించామని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు ఏపీ ఆర్థికలోటు భర్తీకి ప్రత్యేక నిధులు కేటాయించామని వెల్లడించింది.
Read Also: సిట్ రిపోర్టును అందజేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
Follow us on: Youtube Instagram