36.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 సీజన్‌ కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ముడి జూట్ ఎంఎస్పీ మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్‌కు 315 పెంచింది. 2025-26 సీజన్‌లో ముడి జనపరాన ముడి జనపరాన కనీస మద్ధతు ధర క్వింటాలుకు 5వేల 650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8 శాతం రాబడిని ఇస్తుందని కేంద్రం పేర్కొంది.

జాతీయ ఆరోగ్య మిషన్‌ను వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత పదేళ్లలో ఆరోగ్య మిషన్ చారిత్రాత్మక లక్ష్యాలను సాధించిందని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ అన్నారు. 2021-2022 మధ్య, సుమారు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు జాతీయ ఆరోగ్య మిషన్లో చేరారని, ఈ మిషన్ కింద భారతదేశం COVID-19 మహమ్మారిపై పోరాడిందని గోయల్ చెప్పారు.

Latest Articles

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్