33 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం

     రామోజీరావు అస్తమయం కావడంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్ర బాబు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుం టారని భావించానన్నారు. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన వ్యక్తి రామోజీరావని చెప్పారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు సంతాపం తెలిపారు.

   ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుం బ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగుభాష, సంస్కృ తులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయ మన్నారు.రామోజీరావు లేనిలోటు ఎప్పటికీ పూడ్చలే నిద న్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని చెప్పారు. తెలుగు పత్రికా, మీడియారంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ    కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్