28.2 C
Hyderabad
Sunday, July 14, 2024
spot_img

అక్షర దిగ్గజం – అస్తమయం

   తెలుగు నాట అక్షర యోధుడిగా పత్రికా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను ఈనాడు పత్రికలో కనిపించేలా చేశారు.ఈనాడు చదివితేనే వార్తలు చదవినట్టు అనే స్థాయికి పాఠకుడిని తీసుకెళ్లిన ఘనత రామోజీరావుది. దేశవిదేశా ల్లో రామోజీరావును మించిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండొచ్చు. ఆయనను మించి అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అనేకమంది కనిపిస్తారు. కానీ రామోజీ వ్యాపారవేత్తల ఊహకే అందని, వేలు పెట్టటానికే సాహసించని ఎన్నోరంగాల్లో ఎన్నెన్నో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన జీవితంలో ముడిపడిన ప్రతి విషయం యువత కు మేలుకొలుపు గీతం లాంటిదే. అంటే అతిశయోక్తి కాదు.అలాంటి రామోజీ గ్రూప్ అధినేత రామోజీ రావు కన్నుమూత పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

  అతడే ఒక సైన్యంగా ఎన్నో వ్యాపార సంస్థలను రామోజీ గ్రూప్ అధినేతగా నడిపారు.అందరినీ తన వెనకే నడిపించారు. అందరి ఆలోచనలూ తనే పనిచేశాడనేది వాస్తవం. ఓటమిని కలలోకి కూడా అంగీక రించని బలహీనుడు” అనే మాటలు రామోజీలోని “నేను” అనే భావన స్పష్టంగా చూసిన పాత్రికేయులు ఉన్నారు. బహుశా రామోజీరావును ఇంత బలవంతుడిగా నిలబెట్టింది, ఈ ఆలోచనా విధానమేనని చాలా మంది మేధావులు స్పష్టంగా చెప్తారు. వాస్తవానికి ఆయన సంకల్పబలమే ఆయన సాధనకు పురికొ ల్పాయి. తెలుగు వారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు రామోజీరావు.“మీడియా మొగల్”గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఆయన ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితోపాటు ఉషాకిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ప్రియా పచ్చళ్ళు, కళాంజలి వంటి ఎన్నో విభాగాలు వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా నిలిచాయి.

   రామోజీరావు అనగానే ఈనాడు. ఈనాడు అనగానే రామోజీరావు. ఈ గుర్తింపే ఆయనకు కూడా ఎంతో ఇష్టమైన అంశం. విజయానికి విలాసంగా, కీర్తికి చిహ్నంగా వర్ధిల్లుతున్న రామోజీరావు కన్నుమూత మీడియా రంగానికి తీరని లోటు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.ఆయనకు తన తల్లి దండ్రులు పెట్టిన పేరు రామయ్య. అయితే ఆ పేరు నచ్చక తానే ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీ రావు అన్న పేరును సృష్టించుకున్నారు. బాల్యం నుంచే ఆయన ఆయన ఆలో చనలు చాలా వినూత్నంగా ఉండేవని ఆయన బాల్య మిత్రులు చెప్తారు.1961 ఆగస్టు 19న రామోజీ రావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక ఈమె కూడా రామాదేవి అని పేరు మార్చుకుంది. వీరి ఇద్దరు కుమారులు కిరణ్ ప్రభాకర్,సుమన్ ప్రభాకర్ కాగా ఒక కూతురు  ఈమెను దత్తత తీసుకు న్నారంటారు.

  ఆయన తన చిన్నతనం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించేవాడు. సృజ నాత్మకంగా ఏదైనా చేయాలని నిరంతరం పరితపించేవాడు. రైతుల సంక్షేమం కోసం పనిచేయాలనే ఆసక్తిని కనబరిచాడు.ఆయనలోని ఈ విశిష్ట వ్యక్తిత్వం తెల్లటి సఫారీ.. తెల్లటి బూట్లు, సరళమైన భాష.. అధునాతన వ్యక్తిత్వంతో చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపించేవాడు. ఆయనలో ఎంత ఒత్తిడి ఉన్నా ఎక్కడా ఆయన ముఖంలో కనబడనిచ్చేవాడు కాదు. ఆ విలక్షణ వ్యక్తి త్వమే ఆయనను విజయ సోపానాలను అధిరోహించేలా చేసింది.

    రామోజీ చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా బాధ్యతలు నిర్వ హించారు. మూడేళ్లపాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.ఆ తర్వాత 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇదిఆయన జీవితంలో తొలి వ్యా పారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967-1969 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని ఆరంభించారు. 1969లోరామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యాపారంలోకి అడుగు పెట్టారు. అది కూడా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌ మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు ఆయన సతీమణి రమాదేవి చూసుకున్నారు.

  తెలుగునాట నాలుగున్నర దశాబ్దాల క్రితం వరకు పత్రిక రంగం సామాన్యంగానే ఉండేది. 1974 ఆగష్టు 10న రామోజీ రావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు.1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.ఈనాడు పత్రిక అనేక వార్తా పత్రికలకు మార్గదర్శకంగా నిలిచింది.రాష్ట్రంలో ఎన్ని పత్రికలు వచ్చినా, ఈనాడు పత్రిక తర్వాతే అనే నానుడి స్థిరప డిపోయింది.అంతేకాదు అదేశాశ్వత ముద్రగా పత్రికా రంగంలో స్థిరపడింది. రామోజీ ఫౌండేషన్ పేరిట తెలుగు సాహిత్య రంగానికి పెద్దపీట వేశారు.ఈ నేపథ్యంలో చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరంగా వ్యతిరేక పవనాలు వీడయంతో ఈ పత్రికలు పూర్తిగా నష్టాల భారిన పడ్డాయి.దీంతో కరోనా అనంతరం 2021 మార్చి సంచికలతో ఈ పత్రికలన్నీ మూతపడ్డాయి. తెలుగు భాషా, సాహిత్యాలపై మక్కువ. రచయితలంటే ఉండే గౌరవం, సొంత ఊరును దత్తత తీసుకున్న వైనం ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని మరో కోణంలో ఆవిష్కరిస్తాయి.

  క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైంది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైంది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.ఉషా కిరణ్ మువీస్ బ్యానర్ ని స్థాపించి చిత్ర పరిశ్రమలో అద్వితీయమైన చిత్రాలను నిర్మించారు. విలువలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలనే ఆయన ఉషాకిరణ్ మువీస్ బ్యానర్ పై నిర్మిం చారు.శ్రీవారి ప్రేమలేఖతో తొలిసినిమా విడుదల చేశారు. దాదపు నాలుగు దశాబ్దాలు పాటు విలక్షణమైన కథాం శాలతో సామాజిక దృక్పథాన్ని వీడకుండా అద్భుత చిత్రాలను ఆవిష్కరించారు. 1987లో ప్రతిఘటన సినిమా చరిత్రను సృష్టించింది.అలాగే 1989లో మౌన పోరాటం.. 1991లో అశ్వని వంటి ఆయన నిర్మించిన చిత్రాలు చిత్రపరిశ్రమలో చరిత్రను సృష్టించాయి.

   హైదరాబాద్ శివార్లలో రామోజీఫిలింసిటీలో నివాసముండే రామోజీ.. ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకూ అందరికీ తన ఫిలింసిటీకే రప్పించుకుంటారు. మంత్రులను, ముఖ్యమంత్రులను మార్చేయగల సత్తా ఉన్న కింగ్ మేకర్ గా పేరున్న ఆయన తెర వెనుక నుంచే అంతా నడిపించగల వ్యక్తిగా పేరు పొందారు.అలాంటి రామోజీ తన జీవితంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుసుకునేందుకు సెక్రటేరియట్ కు వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తగా పేరున్నా.. తెలంగాణ విషయంలో బ్యాలెన్స్ మొయిం టైన్ చేస్తూ వచ్చారు. అదే కొంతవరకు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడిందనే వాదనలు వినిపి స్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ, వికాసాల్లో రామోజీరావు ప్రముఖ పాత్ర పోషించారు. ఒక దశలో ఆయనే ప్రముఖ నేతగా ఎదుగుతారా అనే గుసగుసలువినిపించాయి.అంతేకాదు ఎంతోమంది రాజకీయ వేత్తలకు ఆయన రాజగురువుగా ప్రఖ్యాతి చెందారు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన మార్గదర్శి వివాదం మొదలైనప్పటి నుంచి ఆయన ఆర్థిక మూలాలపై పెద్ద దెబ్బే పడింది.అయినా అయన ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో ముందుకు కదిలారు. సినీ ఇండస్ట్రీలో దర్శక రత్న దాసరి నారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణతో వచ్చిన వివాదాల్లో కూడా ఆయన తనదైన శైలినే ప్రదర్శిం చారు.రామోజీరావు ఇన్ని సంస్థలను ఇంతకాలం పాటు, ఇంత విజయవంతంగా ఎలా నడిపారు? ఇందరు వ్యక్తుల మధ్య చాకచక్యంగా ఎలా మెలిగారు? ఘర్షణల సమయంలో తన పోరాటపటిమను ఎట్లా చూపించారు? అనేది నిజంగా సామాన్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

  రామోజీ జీవిత ప్రయాణాన్ని దేశంలోని లక్షలాది మంది అపురూపమైన… స్ఫూర్తిదాయకమైన సక్సెస్ మంత్రంగా భావిస్తారు. 1996లో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో “ రామోజీ ఫిల్మ్ సిటీ ”కి ఛైర్మన్‌గా వ్యవహించారు.ఇది వేలాది మంది ఉద్యోగుల జీవనోపాధికి కేంద్రబిందువుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి వినోద ప్రదేశంగా ఆవిష్కృతమైంది. ప్రపంచ చిత్ర పరిశ్రమకు రామోజీ ఫిలింసిటీ వేదికగా మారింది.ఆర్ఎఫ్ సీ యజమానిగా రామోజీ రావు తన శక్తివం తమైన చిత్రాలతో మహిళల హక్కులు, సమానత్వ సాధనకు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు. సినిమాలకు స్క్రిప్ట్‌లను ఎంచు కుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రామోజీరావుది ఒక ప్రత్యేక శైలి.ఈటీవి ఛానల్ అనేది ఆయన అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి. ఆయన కృషితో దానిని ఎక్సలెన్స్ స్థాయికి తీసుకు వచ్చారు.ఆయన 1995లో ఈటీవి నెట్‌వర్క్ ఛానెల్‌లో 12 ఛానెల్‌ల సమూహాన్ని ప్రారంభించా డు.వివిధ భాషలలో వినోద వనరులతో సమాచారాన్ని ప్రసారం చేశాడు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రేక్షకులను అలరించే తెలుగు , హిందీ , బంగ్లా , మరాఠీ , కన్నడ , ఒరియా , గుజరాతీ, ఉర్దూ భాషల్లో రోజువారీ టీవీ సిరీస్‌లు, టీవీ షోలను ప్రసారం చేయడంలో ఈటీవి ఛానెల్ ప్రముఖ ఛానెల్‌లలో ఒకటి. రైతుల జీవితా లను, వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ఛానెల్ ప్రసారం చేయడం ప్రారంభించింది. రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి టీవీషో ఇది. అన్న దాత కార్యక్రమం అత్యధిక టీఆర్పీ ర్యాంక్ సాధించింది.ఈటీవి ఛానెల్ ఇప్పటికీ ఢీ, జబర్దస్త్, అభి రుచి ఇతర షోలను నిర్మిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతుంది.

  రామోజీ రావు 2002లో హయత్‌నగర్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ మొదటి గేటు దగ్గర తన సతీమణి ‘రమాదేవి పబ్లిక్ స్కూల్ ‘ పేరుతో ప్రసిద్ధ పాఠశాలను స్థాపించారు .అంతేకాదు రామోజీ తన సొంత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ని ప్రారంభించారు. తెలుగు సినిమాలను సమీక్షిం చడానికి ‘సితార’ పత్రికను ప్రవేశపెట్టాడు.90ల నాటి ప్రజలు సితార వారపత్రిక కోసం వేచి ఉండేవారు. గెలుపు ఒక్కటే లక్ష్యంగా సాగిన రామోజీ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి. ఎన్నో తీపి గురు తులు, చేదు జ్ఞాపకాలు దాగివున్నాయి. మరెన్నో వ్యూహ, ప్రతివ్యూహాలు ఉన్నాయి. ఆయనను అమితం గా ఆరా ధించేవారు ఉన్నారు. ఏ మాత్రం ఇష్టపడనివారూ ఉన్నారు. అవసరం కోసం అభిమానంగా నటించిన వారూ ఉన్నారు. బద్ద శత్రువులూ ఉన్నారు. రోల్ మోడల్ గా భావించేవారూ ఉన్నారు. తటస్థు లూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఇందరి హృదయాల్లో… జీవితాల్లో… మెదళ్ళలో… మెదిలే రామోజీ జీవితం ఒక అద్భుతమే.

    ఆయన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి పవర్ ఫుల్ బిజినెస్ టైకూన్‌గా, జర్నలిస్టుగా, సినీ నిర్మాతగా మీడియా ఎంటర్‌ ప్రెన్యూర్‌గా వేలాది మందికి సేవ చేస్తున్న గొప్ప వ్యాపార వేత్తగా ఎదిగాడు.తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభకు దక్షిణాది జాతీయ చలనచిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. రామోజీ జీవితం మొత్తం ఒక కఠోర పరిశ్రమ అంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆయన చేసిన సేవలకు గానూ అనేక పురస్కారాలు వెతు క్కుంటూ వచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ,శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వ విద్యా లయం గౌరవ డాక్టరేటును అందించి సత్కరించాయి. కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్తాన్ అవార్డు అందుకున్నారు.బి.డి. గోయెంకా అవార్డు సైతం ఆయనను వరించింది. జర్నలిజం, సాహిత్యంలో ఆయన చేసిన సేవకు, అంకిత భావానికి 2016 సాహిత్యం, విద్య విభాగాలలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన 87 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో శుక్రవారం మధ్యా హ్నం 3 గం.ల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలెటర్ పై చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పత్రిక,మీడియా రంగానికి తీరని లోటు. ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకం.

Latest Articles

ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్