స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ స్పందించింది. తన విచారణకు నాలుగు రోజులు సమయం కోరడంతో వాట్సాప్ ద్వారా మరోసారి నోటీసులు పంపించింది. హైదరాబాద్ సీబీఐ ఆఫీస్ లో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద సోమవారం విచారణకు ఎంపీ అవినాష్‌కు సీబీఐ నోటీసులు పంపించింది. ఈ క్రమంలో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.