మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున పులివెందులలోని అవినాశ్ నివాసానికి రెండు వాహనాల్లో వెళ్లిన సీబీఐ బృందం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పీఏలను ఇంటి బయటే ఉంచింది. ఇంటి లోపల ఉన్న అధికారులు అవినాశ్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో నాలుగు సార్లు అవినాశ్ రెడ్డిని అధికారులు విచారించారు. మొన్న అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయ్ రిమాండ్ రిపోర్టులో వివేకా హత్య కేసులో అవినాశ్ పాత్ర ఉందంటూ పేర్కొన్న సీబీఐ.. ఇప్పుడు తెల్లవారుజామునే పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లడం సంచలనంగా మారింది. దీంతో ఏం జరగబోతుందనే ఆందోళనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.