స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సహనిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న(సోమవారం) విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోమవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. కాగా ఈనెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని హాజరుకాలేదు. అనంతరం ఈనెల 19న రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతూ ఆరోజు కూడా విచారణకు డుమ్మా కొట్టారు. దీనిపై సీరియస్ అయిన సీబీఐ అధికారులు కచ్చితంగా సోమవారం విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.